30 August, 2026 | 11:21 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

షాంపూలో ఇవి కలపండి!

04-05-2025 12:00 AM

షాంపూను నేరుగా కాకుండా కొన్ని నీళ్లలో కలుపుకొని తలస్నానం చేయడం మనకు తెలిసిందే. అయితే కేవలం నీటిలోనే కాకుండా కొన్ని పదార్థాలనూ షాంపూలో కలుపుకుని తలస్నానం చేయవచ్చు అంటున్నారు నిపుణులు. ఫలితంగా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు. 

* రోజ్ వాటర్‌లో షాంపూను కలిపి తలస్నానం చేస్తే కుదుళ్లలో దురద, అలర్జీ, ఇన్ఫెక్షన్.. వంటివి దూరమవుతాయి. అంతేకాదు.. జుట్టు మెత్తగా, పట్టుకుచ్చులా మెరుస్తుంది. 

* షాంపూలో కాస్త ఎసెన్షియల్ ఆయిల్ కలిపి చూడండి. ఇలా చేయడం వల్ల 

జుట్టు రాలడం తగ్గి మరింత ఒత్తుగా పెరుగుతుంది. 

* జట్టు నిర్జీవంగా కనిపిస్తుంటే.. షాంపూలో నిమ్మరసం కలిపి చూడండి.. వెంట్రుకలు నిగనిగలాడుతూ పట్టుకుచ్చులా మెరుస్తాయి.

* షాంపూలో కాస్త తేనె కలిపితే జుట్టు పొడిబారకుండా తేమను సంతరించుకుంటుంది. తేనె కదుళ్లను ఆరోగ్యంగా మారుస్తుంది.