calender_icon.png 6 July, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాతో రిలేషన్ పెట్టుకుంటే..

06-07-2025 12:35:57 AM

సినీతారల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితం, డేటింగ్, రిలేషన్‌షిప్.. ఇలా నిత్యం ఏదో ఒక వార్త ఫిల్మ్‌సర్కిళ్లలో చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఈసారి హీరోయిన్ రెజీనా కసాండ్ర వంతు వచ్చింది.

తాజాగా తన పెళ్లి గురించి వచ్చిన ప్రశ్నలకు కొద్దిగా తనదైన శైలిలో జవాబిచ్చింది. 2005లో విడుదలైన తమిళ చిత్రం ‘కండనాల్ మొదల్’తో ఇండస్ట్రీకి పరిచయమైన రెజీనా దశాబ్దంగా వరుస సినిమాలతో అలరిస్తున్నప్పటికీ సరైన బ్రేక్ అందుకోలేకపోయింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో విభిన్న చిత్రాలు, వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లోనూ అదరగొట్టేసింది.

ఇటీవల సినిమాలు, వెబ్‌సిరీస్ చేస్తున్న రెజీనా వయసు ప్రస్తుతం 34 ఏళ్లు. దీంతో ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందనే ప్రశ్నలు తరచూ ఎదురవుతున్నాయి. తన పెళ్లి గురించి వస్తున్న కామెంట్స్‌పై ఇదివరకే ముక్కు సూటిగానే సమాధానమిచ్చిందీ బ్యూటీ. తాజాగా మరో సారి ఇదే ప్రస్తావన రావటంతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

‘నా పెళ్లి గురించి నా తల్లే అడగడం లేదు.. మీరెందుకు అడుగుతున్నారు? మీకెందుకు అంత అక్కర’ అంటూ ఫైర్ అయింది. అంతేకాదు రిలేషన్ గురించి చెప్తూ.. ‘నాతో ఎవరైనా సంబంధం పెట్టుకుంటే వారికే కష్టం. ఫ్రెండ్‌షిప్ ఈజీగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.