06-07-2025 12:32:45 AM
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్2’. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
వైఆర్‌ఎఫ్ బ్లాక్ బస్టర్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తం గా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సిని మాను సితార ఎంటర్‌టై న్‌మెంట్స్ విడుదల చేయనుంది. తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించు కున్న విషయాన్ని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారి కంగా తెలియజేసింది.