calender_icon.png 24 November, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు.. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్

24-11-2025 06:11:26 PM

హైదరాబాద్: కొడంగల్ ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్ గా 16 నెలల్లోపు చేస్తామని, మూడు నెలల్లో కొడంగల్ లోని ప్రతి గ్రామానికి కృష్ణా నీళ్లు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లగచర్ల పారిశ్రామికవాడకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తామని, తెలంగాణ నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు. రాబోయే కొన్ని నెలల్లో కొడంగల్ రైల్వే పనులు ప్రారంభమవుతాయని, ఈ నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. లగచర్లలో కుట్రలు చేసి భూసేకరణను అడ్డుకున్నారని, అన్యాయంగా రైతులు కేసుల్లో ఇరుక్కునేలా చేశారని ప్రతిపక్ష నాయకులపై రేవంత్ రెడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకమని, త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయని, అందుకు సంబంధించిన నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లోనే వస్తుందని సీఎం తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను సర్పంచ్ లుగా ఎన్నుకోవద్దని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే వారికి అండగా నిలవండని  ప్రజలకు సూచించారు. మేం ఇస్తున్న నాణ్యమైన ఆడబిడ్డ చీరను కట్టుకుని ఓటు వేయాలని ఆయన కోరారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డిలేని బుుణాల చెక్కను కొడంగల్ మహిళా సంఘాలకు అందించారు. తరువాత అక్కడికి వచ్చి ఒక్కొక్కరిని స్టేజ్ మీదికి పిలిచి మహిళలకు చీరలను పంపిణీ చేశారు.