25 February, 2026 | 3:10 AM

పేద ముస్లింలకు ‘సౌగత్ ఏ మోదీ’

25-02-2026 01:32 AM
  1. రంజాన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తోఫా
  2. 32 లక్షల కుటుంబాలకు లబ్ధి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: గతేడాది నిర్వహించినట్టుగానే, కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా ‘సౌగత్- ఏ- మోదీ’ చేపట్టనుంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 32 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు ప్రత్యేకమైన కిట్లు పంపిణీ చేయనుంది. రూ.6౦౦ వరకు విలువ చేసే ఈ కిట్‌లో ఆహార పదార్థాలు, దుస్తులు, సేమియా, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, చక్కెర ఉంటాయి. బీజేపీ మైనార్టీ మోర్చ నేతలు పంపిణీ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆవిష్కరించారు.