calender_icon.png 28 October, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రధాని ఎవరు?

04-05-2024 02:23:33 AM

మాజీ గవర్నర్ తమిళిసై 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ప్రధా ని ఎవరు అవుతారో తెలీదనీ బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి జీ కిషన్‌రెడ్డికి మద్దతుగా వారాసీగూడ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు శుక్రవారం రాత్రి జరిగిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ భద్రత, సుపరిపాలనా బీజేపీ ద్వారానే సాధ్యం అవుతోందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే బలమైన ప్రధాని మోదీ మళ్లీ వస్తారన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు దేశం సమగ్రత కోసం జరుగుతున్నాయని అన్నారు.