25-12-2025 02:40:52 PM
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్
ఆసిఫాబాద్(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ అన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన కేరమేరి మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ జాదవ్ అమోల్, ఉపసర్పంచ్ రాథోడ్ పూజ, బోలపాటర్ సర్పంచ్ రాథోడ్ పారుబాయి, ముకదాం గూడా గ్రామ సర్పంచ్ జాదవ్ విమలాబాయి , నార్నూర్ మండలం ఉమ్రి గ్రామ సర్పంచ్ జాదవ్ సంతోష్ శ్యామ్ నాయక్ ను కలిశారు.ఈ సందర్భంగా అజ్మీరా శ్యామ్ నాయక్ నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడారు గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించాలన్నారు.అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.డి. నిజాం, రాథోడ్ దేవిదాస్, జాదవ్ ప్రకాష్, ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు.