calender_icon.png 25 December, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్గొండ బీజేపీలో లొల్లి

25-12-2025 03:09:44 PM

హైదరాబాద్: నల్గొండ జిల్లా(Nalgonda district) బీజేపీ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్గొండ బీజేపీలో(Nalgonda BJP leaders ) రెండు వర్గాల మధ్య విభేదాలు కారణంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. బీజేపీ తరుఫున గెలిచిన సర్పంచ్ లకు సన్మానం విషయంలో వివాదం జరిగింది. బీజేపీ నేత పిల్లి రామరాజుపై ఓ వర్గం దాడి చేసింది. మరో వర్గం జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డిపై దాడికి ప్రయత్నించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్దకు భారీగా తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.