calender_icon.png 25 December, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో వాజపేయి జయంతి వేడుకలు

25-12-2025 03:22:54 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి ఆధ్వర్యములో బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశయాలను కొనసాగిద్దామని 101వ జయంతి వేడుకలు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం వాజ్ పాయ్ చిత్ర పటానికి పూల మాలవేసి స్వీట్స్ పంపిణీ చేసి 101వ జయంతి వేడుకలు కార్యకర్తల, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి, నాయకులు నల్ల మనోహర్ రెడ్డి  పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  భరతమాత గర్భించే ముద్దుబిడ్డ అటల్ బిహారీl వాజ్ పాయ్ జీవితాంతం దేశం కోసం, దేశ సౌభాగ్యం కోసం, అభివృద్ధి కోసం కృషి చేశారు అని తెలియ చేశారు. దేశంలో కనెక్టివిటీ పెరగడానికి హై వేల నిర్మాణం చేపట్టిన మహనీయుడు.

ట్రైబల్ కోసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తపన పడిన గొప్ప నాయకుడు అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా దేశ సౌభాగ్యమే లక్ష్యంగా పని చేశారు. భారత ప్రజా స్వామ్య రూపు రేఖలను తన మాటలతో, అత్యున్నత నడ వడికతో తీర్చి దిద్దిన మహోన్నత రాజ నీతిజ్ఞుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గారు అని వివరించారు.ఈ కార్యక్రమములో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్. కార్యదర్శి వేగోలపు శ్రీనివాస్ గౌడ్, సామాజిక నాయకులు ఎగోలపు సదయ్య గౌడ్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మాటూరి లత, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు గజభింకర్ పవన్, ఎనగందుల సతీష్, ఎలవేని తిరుపతి, భూసారపు సంపత్,  ప్రధాన కార్యదర్శి కందునూరి కుమార్, బుర్ర సతీష్ గౌడ్, OBC మోర్చా అధ్యక్షులు శ్రీగిరి సుధాకర్, ఎల్లంకి రాజు, వల్స సాయికిరణ్, రెడ్డి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.