25-12-2025 02:39:27 PM
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా,భారతి నగర్ డివిజన్‌లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఫెయిత్ టెంపుల్ చర్చిలో పాస్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో, అలాగే రామచంద్రపురం మెథడిస్ట్ చర్చిలో పాస్టర్లు ప్రియా రాజు, సాంసన్ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమాల్లో పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంగ ఆంజయ్య పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొంటూ, అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.