calender_icon.png 25 December, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు

25-12-2025 02:42:31 PM

కిటకిటలాడిన చర్చీలు 

విజయక్రాంతి,పాపన్నపేట: వెలుగులు విరజిమ్మే కొవ్వొత్తుల కాంతులు.. క్రిస్మస్ చెట్లు.. బాల యేసు జన్మ వృత్తాన్ని తెలిపేలా అలంకరించిన పాకలు.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చిలు క్రైస్తవ సోదర, సోదరీమణులతో కిటకిటలాడాయి. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం మండలంలోని ఆయా గ్రామాల్లోని క్రైస్తవ సోదర, సోదరీమణులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఏసుప్రభు నామస్మరణలతో క్రైస్తవాలయాలు మార్మోగాయి. సంఘ కాపరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శాంతి సందేశాలు చేసారు.