14 August, 2026 | 3:25 AM

ఐఐఎంసీ కళాశాల విద్యార్థుల తిరంగా ర్యాలీ

14-08-2026 12:00 AM

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఘనంగా కార్యక్రమ నిర్వహణ

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భా గంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మే నేజ్మెంట్ అండ్ కామర్స్ (ఐఐఎంసీ) డిగ్రీ, పీజీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు, ఎన్‌సీసీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించా రు. కళాశాల నుంచి సెక్రటేరియట్, ఖైరతాబాద్ బడే గణేశ్, వాసవీ కేంద్రం మీదుగా ఒకటిన్నర కిలోమీటర్ పైగా నడుస్తూ వెయ్యి మందికి పైగా విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తిని పెంపొందించే నినాదాలతో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలకు అవగాహన క ల్పించారు.

హర్ ఘర్ తిరంగాప్రతి ఇంటిపై జాతీయ జెండా, దేశభక్తిని చాటుదాం.. జా తీయ జెండాను గౌరవిద్దాం, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్, భారత్ మాతాకి జై, మాత రం మాతరం.. వందేమాతరం వంటి నినాదాలతో ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపా రు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కూర రఘు వీర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా దేశ సమైక్యత బలోపేతం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్లు తిరుమలరావు, సంతోషి, ఆఫీసర్లు రామకృష్ణ.ఇ, సత్యనారాయణ, ఎన్‌సీసీ ఆఫీసర్ వసంత్ కుమార్, వివిధ విభాగాల అధ్యక్షులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తదితరుల తో పాటు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, ఎన్‌సీసీ కాడెట్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.