అయ్యప్ప ఆలయంలో త్రిశూల శివలింగ ప్రతిష్టాపన
14-08-2026 12:00 AM
కేసముద్రం, ఆగస్టు 13 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణంలో ఉన్న ప్రతిష్టాత్మక శ్రీ ధర్మశాస్త అయ్యప్ప ఆలయంలో త్రిశూల శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
స్వామివారి వాహనము నందీశ్వరుని శిలా విగ్రహం దాతగా జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి ,లక్ష్మి దంపతులు 33,300 రూపాయలను ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, ఆర్టిఏ మెంబర్ రావుల మురళి, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.






