calender_icon.png 8 July, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టవిరుద్ధంగా ఆబార్షన్లు

08-07-2025 12:00:00 AM

-భువనగిరి గాయత్రి ఆసుపత్రిపై పోలీసుల దాడులు 

-అబార్షన్లు చేస్తున్న డాక్టర్ శివకుమార్ అరెస్ట్ 

యాదాద్రి భువనగిరి, జూలై 7 (విజయక్రాం తి): యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని గాయత్రి ఆసుపత్రిపై ఎస్‌ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులు పక్కా సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు అక్రమంగా అబార్షన్లు చేస్తున్న డాక్టర్ శివకుమార్‌ను అరెస్టు చేశారు.

శివకుమార్ అరెస్ట్ అవ్వడం ఇది మొదటిసారి కాదు. 2022లో ఆలేరు లో ఓ బాలికకు అబార్షన్ నిర్వహించిన సమయంలో కూడా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అప్పట్లో అతను నిర్వహిస్తున్న ‘స్వాతి హాస్పిటల్’ను వైద్యాధికారులు సీజ్ చేశారు. అనంతరం శివకుమార్ తన అసలు పేరు, హాస్పిటల్ పేరు మార్చి గాయత్రి ఆసుపత్రిగా భువనగిరిలో మళ్లీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన ప్రతి అబార్షన్‌కు రూ.50 వేలు వసూలు చేస్తున్నట్టు సమాచారం.