08-07-2025 12:00:00 AM
జడ్చర్ల, జూలై 7: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఇద్ద రు యువతులు అదృశ్యమైన ఘటన సోమ వారం జరిగింది. బురెడ్డిపల్లి పరిధిలోని బృం దావన కాలనీకి చెందిన దీవెన అనే యువతి శంషాబాద్‌లో ఓ ప్రైవే ట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది. విధులు నిర్వహించేందుకుగాను ఆదివారం సాయంత్రం జడ్చర్ల బస్టాండ్‌లో షాద్‌నగర్ వెళ్లే బస్సును కుటుంబ సభ్యులు ఎక్కించారు.
తాను పనిచేస్తున్న సంస్థకు చేరుకోకపోవడంతో పాటు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే జడ్చర్లలోని గౌరీశంకర్ కాలనీకి చెందిన వనజ ఇం టర్ సెకండ్ ఇయర్ చదువుతున్నది. ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం వెళ్లి రాత్రి 8:30 గంటలకు ఇంటికి తిరిగొచ్చేసరికి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.