08-07-2025 12:00:00 AM
మంత్రులు పొంగులేటి, జూపల్లి
నల్లమల ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ
నాగర్‌కర్నూల్, జూలై 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో అర్హత గల చెంచు గిరిజనులకు అదనంగా 27 వేలు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు రెవెన్యూ, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని చెంచు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డిలతో కలిసి ల బ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భ ంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అత్యంత నిరుపేదలను గుర్తించి వారి జీవనో పాధి మెరుగుపడే విధంగా పరిపాలన చే స్తోందన్నారు. రాష్ట్రంలోని 21 నియోజకవర్గ ంలో 13,266 చెంచు కుటుంబాలకు విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ సొంత జిల్లా అయిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కంకణబద్దులై ఉన్నారని గుర్తు చేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం మాటలతోనే స రిపెట్టిందని ప్రస్తుతం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా అవసరాలను ప్రజా సమస్యలను దృ ష్టిలో ఉంచుకొని వాటికి అ నుగుణంగానే పాలన కొనసాగిస్తుందని పే ర్కొన్నారు. మంత్రుల వెంట కలెక్టర్ సంతోష్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.