25 March, 2026 | 9:36 PM

రాష్ట్ర వ్యాప్త ఎస్ఎఫ్ఐ నాయకులు అక్రమ అరెస్టులను ఖండించండి

25-03-2026 08:08 PM

దేవరకొండ(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్త ఎస్ఎఫ్ఐ నాయకులు అక్రమ అరెస్టులను ఖండించండని ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగా వెంకటేష్ అన్నారు. బుధవారం దేవరకొండ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ విద్యార్థులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతే అక్రమ అరెస్టులు చేయడం ప్రభుత్వానికి సిగ్గు చేటు అని అన్నారు.

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సహా  రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నాయకులనుఅరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ అన్నారు. రాష్ట్రంలో పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని, అనేక విద్యాసంస్థల్లో భవనాలు, తరగతి గదులు, ల్యాబొరేటరీలు, లైబ్రరీలు, హాస్టళ్లు సరిపడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.