25 July, 2026 | 10:11 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

అక్రమ పశు రవాణాను అడ్డుకోవాలి

16-05-2026 01:28 PM

ములుగు (విజయక్రాంతి): పశువుల అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని, పశువుల అక్రమ రవాణాను అప్రమత్తంగా ఉంటూ అడ్డుకోవాలని పోలీసు అధికారులను ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఆదేశించారు. శనివారం జిల్లా పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి, పస్రా పోలీస్ చెక్పోస్టులను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వాహనాల వివరాలను రిజిస్టర్లలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. పశువుల రవాణా చేసే వాహనాలను, పశువుల రవాణాకు సంబంధించిన పత్రాలను పరిశీలించాలని, అక్రమ రవాణా జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. షిఫ్టుల వారిగా విధుల్లో పాల్గొనాలని, చెక్ పోస్ట్ వద్ద తనిఖీ అధికారులు, సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట ములుగు డిఎస్పి రవీందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శంకర్, పసర, ములుగు సిఐలు దయాకర్, సురేష్, పసర ఎస్ ఐ తాజుద్దీన్ పాల్గొన్నారు.