calender_icon.png 20 January, 2026 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వారీల నుంచి అక్రమ సంపాదన

20-01-2026 12:00:00 AM

  1. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పెట్టుబడిగా నల్లధనం

మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌పై కాంగ్రెస్ నేత రమ్యారావు ఆరోపణలు

చర్యలు తీసుకోవాలని ఈడీకి ఫిర్యాదు

సంతోష్ అనుచరులు ప్రదీప్‌రెడ్డి, నివాస్‌రావుపైనా ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 19 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఆయన అనుచరులు ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాస్‌రావుల అక్ర మాలపై కాంగ్రెస్ నేత రమ్యారావు ఈడీని ఆశ్రయించారు. సోమవారం ఆమె హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారు లను కలిసి, వారిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేయ గా, ఈడీ అధికారులు సానుకూలంగా స్పం దించారని రమ్యారావు తెలిపారు.

ఫిర్యాదు అనంతరం రమ్యారావు మీడియాతో మాట్లాడుతూ.. ‘సంతోష్, ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాస్‌రావుల ముఠా 2013 నుంచి క్వారీలను అక్రమంగా తమ ఆధీనంలో ఉంచుకుని నిర్వహిస్తున్నారు. మైనింగ్ మాఫియాకు సంతోష్ అండగా ఉంటూ ఇసుక, ల్యాండ్ మైనింగ్‌లో చక్రం తిప్పుతున్నారు. క్వారీల ద్వారా అక్రమంగా కూడబెట్టిన సొమ్మును లిక్కర్ స్కామ్‌కు మళ్లించారు.

గతంలో లిక్కర్ స్కాం విచారణ సమయంలోనూ వీరు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఈ ముగ్గురూ దిట్ట. ఫిర్యాదు చేయడానికి ఎక్కడికి వెళ్లినా అధికారులను మేనేజ్ చేస్తున్నారు. పక్కనే ఉన్న మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో అసభ్యకరంగా తిడుతూ పోస్టులు పెడుతున్నారు. అక్రమంగా క్వారీలను వారి పేర్ల మీదకు బదిలీ చేసుకుంటున్నారు.

ఈ ముగ్గురి ఆస్తుల పెరుగుదలపై ఆమె తీవ్ర అనుమానాలున్నాయి. ఒకప్పుడు హోటల్‌లో సర్వర్లుగా పనిచేసిన వీరికి, ఇప్పుడు వేల కోట్లు ఎలా వచ్చాయి. నాలుగైదు బెంజ్ కార్లలో తిరిగే స్థాయికి ఎలా ఎదిగారు’ అని రమ్యారావు ప్రశ్నించారు. వీరి ఆర్థిక మూలాలపై లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 

నిర్వాసితుల జాబితాలో సంతోష్ 

మిడ్ మానేరు నిర్వాసితుల పరిహారంలోనూ భారీ మోసం జరిగిందని రమ్యారా వు ఆరోపించారు. ‘మిడ్ మానేరు నిర్వాసితుల లిస్టులో జోగినపల్లి సంతోష్ పేరు కూడా ఉంది. అందులో ఆయన కులం బీసీ అని రాసుంది. సంతోష్ బీసీ ఎప్పుడు అయ్యారు. నిర్వాసితుల పేరుతో సంతోష్ కుటుంబం మొత్తం లెక్కలేనన్ని ప్లాట్లు కొట్టేసింది’ అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశా రు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె ఈడీని కోరారు.