పేదల ప్రభుత్వ భూముల్లో వ్యాపారుల దౌర్జన్యం
అక్రమంగా లాటరైట్ తవ్వకాలు
ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
తాండూరు, ఏప్రిల్ 10, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం పాషాపూర్ గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 43 /28లో (ఎర్ర మట్టి) లాటరైట్ తవ్వకాలు అనుమతులు ఏవి లేకుండా జోరుగా సాగుతున్నాయి. గ్రామస్తులు భూ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని ఏళ్ల క్రితం ఓమ్లా నాయక్ తండా కు చెందిన గేమ్యా నాయక్, హనుమ నాయక్, బదిలీ బాయ్, హంసింగ్ , రుకీ బాయి తదితరులకు ప్రభుత్వం భూమి కేటాయించింది.
గిరిజనులు ఇట్టి భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వ భూమిపై కన్నుబడిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన తులసీరామ్, ప్రశాంత్ అనే వ్యక్తులు అక్రమంగా దౌర్జన్యం చేస్తూ తమ భూముల్లోకి చొరబడి ఎర్రమట్టి తవ్వకాలు జరుపుతూ, అక్రమ రవాణా చేస్తున్నారు. గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు.
అక్రమార్కులను నిలదీసి అడిగితే మట్టి తవ్వకాల కోసం తాము అనుమతులు తీసుకున్నామని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని గిరిజన రైతులు అంటున్నారు. అక్రమ తవ్వకాల విషయమై సంబంధిత రెవిన్యూ, మైన్స్ అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యక్తులు అనుమతులు తీసుకుని ఎర్రమట్టి తవ్వకాలు జరుపుతున్నామని అనడం బాధాకరమైన విషయమని ..తమ గోడు అధికారులకు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు.
గేమ్యా నాయక్, మాజీ ఎంపీటీసీ మాట్లాడుతూ..
భూమిలేని నిరుపేదలకు గతంలో ప్రభు త్వమే సాగు చేసుకునేందుకు భూమి పంచింది. గ్రామస్తులంతా కోరితే తన భూమిలో దేవాలయం నిర్మించేందుకు కొంత భూమి ఇచ్చేందుకు ముందుకు వచ్చాను. ఈలోగా అక్రమార్కులు కొందరు మా భూముల్లోకి చొరబడి దౌర్జన్యంగా ఎర్రమట్టి తవ్వకాలు జరుపుతున్నారు. అధికారులు ఎర్రమట్టి తవ్వకాలను ఆపాలి.
రుక్కీ బాయి, మాజీ సర్పంచ్ మాట్లాడుతూ..
పేదలకు ప్రభుత్వం భూమి ఇవ్వడంతో ఆ భూమిలో సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వం మాకు ఇచ్చిన భూమిలో కొందరు వ్యక్తులు అనుమతులు తీసుకుని ఎర్రమట్టి తవ్వకాలు జరుపుతున్నామని అనడం బాధాకరమైన విషయమని ..తమ గోడు అధికారులకు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు.




