calender_icon.png 26 May, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తోగ్గూడెం చెక్ డ్యాం మాటున అక్రమ ఇసుక దందా!

26-05-2025 12:17:38 AM

  1. ముర్రేడు వాగులో యంత్రాలతో ఇసుకను తోడేస్తున్న గుత్తేదారు

అర్థరాత్రుల్లో ప్రతి రోజూ పదుల సంఖ్యలో లారీల రవాణా 

అధికారుల చర్యలు శూన్యం

భద్రాద్రి కొత్తగూడెం, మే 25 (విజయక్రాంతి) ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా పై అధికారులను ఉక్కు పాదం మోపాలంటూ హుకుం జారీ చేస్తున్న క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇ సుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుం డా పోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం, తోగ్గూడెం సమీపంలోని భోజ్యతండా వద్ద ముర్రేడు వాగులో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రూ 4.50 కోట్ల తో నిర్మిస్తున్న ఈ చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పది కాలాలపా టు పటిష్టంగా ఉండాలని చెక్ డాం నిర్మాణంలో విధిగా గోదావరి ఇసుక వాడాలి నిబంధనలు ఉన్నప్పటికీ, గుత్తేదారు ముర్రేడు వాగులోని ఇసుకనే నిర్మాణంలో వాడుతున్నాడని ఆరోపణలున్నాయి.ఫలితం గా నిర్మాణంలో నాణ్యత లోపించి గోదావరి వరదకు చెక్ డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

చెడ్డ మాటను అక్రమ దందా

మండల పరిధిలోని పూజా తండా వద్ద నిర్మిస్తున్న చెక్ డ్యాం గుత్తేదారు ,చెక్ డ్యాం నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. ముర్రేడు వాగులోనే యంత్రాలను పెట్టి ఇసుకను అక్రమంగా త వ్వేస్తూ, అర్ధరాత్రుల్లో లారీలకు అమ్ముకుం టూ రూ లక్షలు దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ అక్రమ దందా ప్రతిరోజు అర్ధరాత్రి సమయాల్లో యథేచ్ఛగా కొనసాగుతున్నా, రెవెన్యూ, పోలీస్, మైనిం గ్, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కనుసందాల్లోనే ఈ దందా జరుగుతుందని, కాసులకు కక్కుర్తిపడి అధికారు లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు బలంగా చెబుతున్నారు.

ఇదే అదునుగా భావించిన గుత్తేదారు ఖ మ్మం, పాల్వంచ ప్రాంతాల లారీలకు కూడా అక్రమంగా ఇసుకను ఎగుమతి చేస్తూ రోజు కు రూ లక్షల్లో సంపాదిస్తున్నాడని తెలుస్తోం ది. గతంలో నాగారం వద్ద నిర్మించిన చెక్ డ్యాం వద్ద కూడా ఇదే తరహాలో కాంట్రాక్టర్ అక్రమ ఇసుక దందాకు పాల్పడి, అక్కడి ఇ సుకనే డ్యామ్ నిర్మాణానికి వాడటంతో ఒక్క వర్షానికే ఆ చెక్ డ్యాం పూర్తిగా ధ్వంసమైందని స్థానికులు గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుతం భోజ్యా తండా వద్ద కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమోనని ప్రజలు వాపో తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది..

కొత్తగూడెం నియోజకవర్గంలో సుజాతనగర్ వద్ద నిర్మిస్తున్న చెక్ డ్యాం, పాల్వంచ రెడ్డిగూడెం వద్ద నిర్మాణం చేపడుతున్న హై లెవెల్ బ్రిడ్జ్ కోసం అక్రమంగా తోగ్గూడెం ఇసుకను వాడుతున్నారని తెలుస్తోంది. ని ర్మాణంలో కనీసం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, గోదావరి ఇసుకను వా డాల్సి ఉండగా గుత్తేదారులు మొర్రేడువాగులోని ఇసుకను వాడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

ఈ అక్రమ ఇసుక దందా ను అరికట్టడానికి అధికారులు అక్కడ వాడుతున్న ఇసుకను తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా ఒక ప్రధాన సమస్యగా ఉన్నట్లు గత నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విషయమై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం 

బోజ్యాతండా వద్ద నిర్మిస్తున్న చెక్ డాం లో గోదావరి ఇసుకకు బదులుగా స్థానికం గా లభించే మొర్రేడు ఇసుకలో వినియోగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై నేటి పారుదల శాఖ ఈ ఈ ని వివరణ కోరగా, గోదావరి ఇసుకనే వాడుతున్నారని, అయినా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

 అర్జున్, నీటిపారుదల శాఖ ఈఈ