26-05-2025 12:17:58 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్ ఎన్నికలు(Print Media Press Club Elections) ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో ప్రశాంతంగా జరిగాయి. 8 మందితో కూడిన ఎన్నికల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో క్లబ్ అధ్యక్షుడిగా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా సాక్షి రిపోర్టర్ వారణాసి శ్రీనివాస్, కోశాధికారిగా ప్రజాపక్షం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కలకుంట్ల శ్రీధర్‌లు గెలుపొందారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ప్రెస్‌క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని, జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతామని ముక్తాకంఠంతో పేర్కొన్నారు. అనంతరం గెలుపొందిన క్లబ్ సభ్యులకు జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పీఎస్‌టీలను సన్మానించారు. ప్రెస్‌క్లబ్ ఎన్నికలను పారదర్శకం గా నిర్వహించిన ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులకు క్లబ్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు రామ్మోహన్, హనుమయ్య, సురేష్, అబ్దుల్ రెహమాన్, మహేష్, కృష్ణంరాజు, తారు, మీర్జాసలీంలతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు.