08-08-2025 12:56:20 AM
- అధికారుల అండతో ఇసుక డంపులే... డంపులే చోద్యం చూస్తున్న అధికారులు...
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మంథని ఆగస్టు 7 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల పేరుతో జిల్లాలో ఇసుక అక్రమ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుంది. ప్రభుత్వం ఇసుక ను పేదవారు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల కోసం వెసులుబాటు కల్పించి, గోదావరి, మానేరు నుంచి ఉచితంగా ఇసుక పర్మిషన్ ఇవ్వగా, దానిని కొంతమంది మాఫియా గాళ్ళు అధికారుల అండదండలతో రాత్రి వేళలో అక్రమాలకు పాల్పడుతూ ఇసుకను డంపులు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు.
అందుకు నిదర్శనమే గత మూడు రోజులుగా మొన్న గోదావరిఖని పట్టణ సమీపంలో, అలాగే మంథని మండలంలోని నాగారంలో, ఈ రోజు కుచిరాజ్ పల్లి గ్రామ సమీపంలో దొరికిన ఇసుక డంపు లే ఉదాహరణ, ఈ డంపులను సీట్ చేసి రెవెన్యూ పోలీస్ అధికారులు పట్టుకున్నారు. మంథని ప్రాంతం లో ఇంత పెద్ద ఎత్తున ఈ ఇసుక ను డంపులు చేస్తున్న ఇటు మైనింగ్ అధికారులు గాని, అటు రెవెన్యూ అధికారులు కానీ, పోలీసులు గాని తమకు సంబంధం లేదని చేతులెత్తెస్తున్నారు.
ఇంకేముంది అధికారులు గాఢ నిద్రలో ఉండడంతో ఇసుక మాఫియా గాళ్లు రాత్రి వేళలో గోదావరి, మానేరు నదిలో జెసిబిలు పెట్టి ఇసుకను రాత్రి వేళలో తరలించి డంపు చేస్తూ లారీలతో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇంకేముంది రెండు చేతులతో లక్షలు అక్రమంగా సంపాదిస్తూ పేదవానికి ఇసుక కావాలంటే దొరకకుండా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ఇసుక పాలసీ అబసుపలవుతుంది.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కేవలం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి మాత్రమే ఇసుక తరలించాలి, కానీ ఇందిరమ్మ పేర్ల మీద రోజుకు వందల ట్రాక్టర్లు పట్టపగలే దర్జాగా మానేరు నుంచి గోదావరి నది నుంచి పోతున్న ఏ ఒక్క అధికారి కూడా తనిఖీలు చేయడం లేదు. తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇసుక మాఫియా గాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. ఇటు పేదవాళ్లు మాత్రం ఇసుక కావాలంటే అధికారులు పర్మిషన్ ఇవ్వక ఇబ్బందులు పెడుతున్నారని పేద ప్రజలు వాపోతున్నారు.
ఇందిరమ్మ ఇండ్లపై నిఘా ఏది
జిల్లాలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు తరలిస్తున్న ఇసుకపై అధికారులు నిఘా పెట్టాడం లేదని తెలుస్తుంది. కేవలం ప్రభుత్వం మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంచుకొని ఇండ్లు నిర్మిస్తుంది అందులో మంథని ప్రాంతంలో మండలంలోని అడవి సోమనపల్లి గ్రామా న్ని, రామగిరి మండలంలో రత్నాపూర్ గ్రామాన్ని, ముత్తారం మండలంలో మచ్చుపేట గ్రామాన్ని మాత్రమే పైలెట్ గ్రామా లుగా గుర్తించి అక్కడ వందల ఇండ్లు ప్రభు త్వం నిర్మిస్తుంది. కానీ మంథని మండలంలోని గోదావరి నది నుండి, ముత్తారం మం డలం ఖమ్మంపల్లి, ఓడేడు, పారుపల్లి మానేరు నుండి పట్టపగలే ట్రాక్టర్లతో అక్రమంగా ఇందిరమ్మ పేర్లతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
మరి ఈ ఇసుక ఏ గ్రామాలకు పోతుందో మైనింగ్ రెవె న్యూ, పోలీస్ అధికారులకు మాత్రం కనిపించడం లేదు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కావాలంటే గ్రామపంచాయతీ కార్యదర్శి పర్మిషన్ తప్పనిసరి, కానీ ఒక్క ట్రాక్టర్ కు కూడా పర్మిషన్ లేకుండానే టాక్టర్ పోతుందంటే, అధికారుల కొనుసైగ లోనే అక్రమ ఇసుక నడుస్తుందని కనిపిస్తుంది. దీంతో అధికారులపై ప్రజలు ఆగ్రో వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ ఇసుక మాఫియాపై డంపు చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.