calender_icon.png 8 August, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదుల విధుల బహిష్కరణ

08-08-2025 12:57:51 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు ౭ (విజ యక్రాంతి): న్యాయవాది నారా హరిపై కొంతమంది దాడి చేయడానికి గురువారం న్యాయ వాదులు బార్ అసోసియేషన్ పిలుపుమేరకు విధులను బహిష్కరించారు.ఈ సందర్భంగా ఆసిఫాబాద్, సిర్పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాపర్తి రవీందర్, శ్రీనివాస్ మాట్లాడుతూ నరహరి కోర్టు విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో రెబ్బెన మం డలం నంబాల సమీపంలో కొంతమంది దుం డగులు ఆయనపై దాడికి పాల్పడడం దారు ణం అన్నారు.

నరహరిపై దాడి జరిగిన అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్పటికీ కేసు నమోదు చేయలేదు. న్యాయవాదులపై దాడులు జరుగుతున్నప్పటికీ ప్రొటెక్ష న్ యాక్ట్ తేవడంలో కౌన్సిల్ నిర్లక్ష్యం చేస్తుందని ఇప్పటికైనా లాయర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు టి సురేష్, సతీష్ బాబు, ముక్తా సురేష్ ,రహీస్ హైమద్, కిషోర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.