calender_icon.png 18 February, 2026 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ ఇసుక రవాణా అరికట్టాలి

17-02-2026 12:16:33 AM

తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం

కృష్ణ. ఫిబ్రవరి 16: నారాయణపేట జిల్లా  కృష్ణా మండలం లోని గురజాల గ్రామ శివారులోని కృష్ణానది నుండి అక్రమ ఇసు క రవాణాను అరికటాలని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, రైతులు సోమవారం కృష్ణా తా సిల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయ కులు శివరాజు పాటిల్ మాట్లాడుతూ కృష్ణా మండలం ఆలంపల్లి గ్రామ శివారులో కల్వర్టు పనులకు 35 ట్రిప్పుల ఇసుక మాత్ర మే అనుమతి ఉన్నప్పటికీ, అదనముగా ఆలంపల్లి శివార్లు అక్రమ ఇసుక డంపు చేసి అక్కడి నుంచి కర్ణాటకకు రాత్రి వేళల్లో నం బర్ ప్లేట్ లేని టిప్పర్ల ద్వారా జోరుగా అక్రమముగా ఇసుకను తరలిస్తున్నారని వార న్నారు.

అక్రమ ఇసుక రవాణాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు కేవలసి వస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో అశ్విని మహేష్, మాజీ సర్పంచ్ శివ ప్ప, ఆంజనేయులు, భీమ్, అనిల్ కుమార్, సంతోష్, తిమ్మప్ప, పాల్గొన్నారు.