calender_icon.png 18 February, 2026 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువైన బల్దియా చైర్మన్లు

17-02-2026 12:18:52 AM

సంగారెడ్డి/జహీరాబాద్/సదాశివపేట/పటాన్చెరు/గుమ్మడిదల/నారాయణఖేడ్, ఫిబ్రవరి 16 : సంగారెడ్డి జిల్లాలోని 11 ము న్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలు గెలుపొందగా, బీఆర్‌ఎస్ 8 స్థానాల్లో చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. రెండు స్థానా ల్లో బీజేపీ వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుంది. సోమవారం నిర్వహించిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా జహీరాబాద్,

ఇంద్రేశంలో కోరం లేక మంగళ వారానికి వాయిదా పడింది. కోహీర్, జహీరాబాద్, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారంలో హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే వీటిలో ఇస్నాపూర్, జిన్నారం బీఆర్‌ఎస్ చై ర్మన్ పీఠాలు గెలుపొందగా, కోహీర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుపొందింది. 

గెలుపొందిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు...

సంగారెడ్డి మున్సిపాలిటీలో కూన వనతి(కాంగ్రెస్) చైర్మన్ కాగా, షేక్ షఫి అహ్మ ద్(కాంగ్రెస్) వైస్ చైర్మన్ అయ్యారు. సదాశివపేటలో చైర్మన్గా మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ(కాంగ్రెస్), వైస్ చైర్మన్గా రేణుక చిరు(కాంగ్రెస్) ఎంపికయ్యారు. ఆం దోల్-జోగిపేటలో చైర్మన్గా సోమిరెడ్డిగారి కృ ష్ణారెడ్డి, వైస్ చైర్మన్గా ఆకుల సత్యనారాయణ(కాంగ్రెస్) ఎన్నికయ్యారు.

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో చైర్మన్గా నగేష్ కుమార్ శెట్కార్(కాంగ్రెస్), వైస్ చైర్మన్గా దారం శంకర్(కాంగ్రెస్) ఎన్నికయ్యారు. ఇస్నాపూర్ చై ర్మన్గా మోటె సుమలత(బీఆర్‌ఎస్), వైస్ చైర్మన్గా పట్లోళ్ళ మాధవి(కాంగ్రెస్) ఎంపికయ్యారు. జిన్నారంలో నక్కిర్తియాట జనార్ధ న్(బీఆర్‌ఎస్), వైస్ చైర్మన్గా వంగేటి ప్రతాప్రెడ్డి(బీజేపీ) ఎన్నికయ్యారు. 

గుమ్మడిదలలో చిన్నపాపని కుమార్గౌడ్(బీఆర్‌ఎస్), వైస్ చైర్మన్గా చిమ్ముల సంధ్య(బీఆర్‌ఎస్) ఎంపిక కాగా, గడ్డపోతారంలో చైర్మన్గా గద్దె సుష్మ(బీఆర్‌ఎస్), వైస్ చైర్మన్గా లక్ష్మగౌని మహేంద ర్గౌడ్(బీఆర్‌ఎస్) ఎన్నికయ్యారు. అలాగే కోహీర్ మున్సిపాలిటీకి చైర్మన్గా ఎం.అశోక్(కాంగ్రెస్), వైస్ చైర్మన్గా ఎండి.అబ్దుల్ హన్నన్ జావీద్(కాంగ్రెస్) ఎంపికయ్యారు.