15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అక్రమంగా నల్లమట్టి రవాణా!

16-06-2025 12:00 AM

ద్వంసమైన పెద్ద వాగు మాదారం కొడకంచి గ్రామాల వాగులోంచి వెలికితీత

పటాన్ చెరు, జూన్ 15 : సహజ సిద్దమైన వాగును కొందరు అక్రమ మట్టి తవ్వకాలతో ధ్వంసం చేస్తున్నారు. మాదారం - కొడకంచి గ్రామాల మద్య ఉన్న పెద్ద వాగు మట్టిని తవ్వి నాలుగు వంకరలు చేశారు. వర్షం కురిస్తే  తవ్వకాలు జరుపుతున్న చోటుకి నీటి వరద రాకుండా మట్టిని అడ్డుకట్ట వేశారు. ఈ మట్టి దందాను రాత్రి పూట కొనసాగిస్తున్నారు.

గత నాలుగు రోజులుగా రాత్రిపూట గుట్టు చప్పుడు కాకుండా  వాగులోంచి నల్లమట్టిని తవ్వి తరలిస్తున్నారు. నల్లమట్టికి అధిక డిమాండ్ ఉండడంతో ఇటాచీతో తవ్వకాలు జరిపి టిప్పర్ ల ద్వారా తరలిస్తున్నారు. తవ్వకాలు  గత నాలుగు రోజులుగా జరుగుతున్న రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేవని గ్రామస్తులు తెలిపారు. వాగు వద్దనే ఇటాచీ రాత్రింబవళ్లు ఉంటున్నాయి. రాత్రి అయ్యిందంటే టిప్పర్ లు తవ్వకాల వద్దకు వస్తున్నాయి. ఇప్పటికే మాదారం నుంచి ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు వరకు బీటీ రోడ్డు గుంతలు ఏర్పడ్డాయి.

అధిక లోడుతో రాత్రిపూట వెళ్తున్న టిప్పర్ లతో రోడ్డు మరింత ధ్వంసం అవుతోంది. గతంలో ఇదే ప్రాంతంలో వాగు మట్టిని తవ్వి  ఇసుక ఫిల్టర్లు నిర్వహించేవారు. దీంతోనే వాగు ఇక్కడ  చాలా వరకు ఆనవాలు కోల్పోయింది. మళ్లీ అదే చోట చెట్లను తొలగించి నల్లమట్టిని  తవ్వుతూ వాగును వెడల్పుగా చేస్తున్నారు. మట్టి తవ్వకాలపై గత రెండు రోజులుగా అధికారులకు ఫోన్ చేసి చెబితే  వాగులోంచి మట్టి తవ్వకాలు బంద్ చేయండి ఫిర్యాదులు వస్తున్నా యంటూ సంబంధిత వ్యక్తులకు  అధికారులే ఫోన్లు చేస్తున్నారని మాదారం గ్రామస్తులు తెలిపారు. మట్టి తవ్వకాలను అడ్డుకొని వాగును రక్షించాలనికోరుతున్నారు.