17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన సిద్దిపేట కలెక్టర్

16-06-2025 12:00 AM

హుస్నాబాద్, జూన్ 15 : సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన హైమావతి,  కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమితులైన ప్రఫుల్ దేశాయ్ ఆదివారం హుస్నాబాద్లోని మంత్రి క్యాంపు ఆఫీసులో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా, కలెక్టర్ హైమావతి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తమకు కేటాయించిన జిల్లాల్లో చేపట్టిన, చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. నూతన బాధ్యతలు చేపట్టిన ఇరువురు అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపి, తమ జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అధికారులతో మంత్రి జరిపిన ఈ సంప్రదింపులు, భవిష్యత్తులో స్థానిక సంస్థలు, జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని పెంచి, అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడంలో తోడ్పడతాయని భావిస్తున్నారు.