31 August, 2026 | 1:03 AM

మంచినీటి ఎద్దడికి తక్షణ పరిష్కారం

31-08-2026 12:01 AM

ప్రజాసమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జారే

దమ్మపేట, ఆగస్టు 30, (విజయక్రాంతి):  మండల పరిధిలోని మొద్దులగూడెం ఎస్సీ కాలనీలో గత రెండు రోజులుగా తాగునీటి ఎద్దడితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని విజయక్రాంతి డిజిటల్ న్యూస్ ద్వారా  తెలుసుకున్న అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ తక్షణమే స్పందించారు.

వెంటనే ఎమ్మెల్యే జారే కాలనీకి తక్షణమే కొత్త బోర్వెల్ ను మంజూరు చేయించి, బోర్ వేయించి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి,  వెంటనే పరిష్కరిస్తూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు మొద్దులగూడెం ఎస్సీ కాలనీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.