ప్రశాంతంగా నిమజ్జనం జరపాలి : సీఐ వెంకట్‌రెడ్డి
01-09-2025 | 12:02am
సిర్గాపూర్, ఆగస్టు 31:గ్రామాల్లో గణేష్ నిమజ్జనాన్ని భక్తి శ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని సిర్గాపూర్ మండల పరిధిలోని ప్రజలకు సీఐ వెంకట్ రెడ్డి సూచించారు. సర్కిల్ పరిధిలోని సిర్గాపూర్, కల్హేర్, కంగ్టి మం డలాల్లో మండల పరిధిలోని గ్రామాల్లోఎవరైనా నిమజ్జన ఊరేగింపు సమయంలో మండపం వద్ద డీజే పెడితే సీజ్ చేస్తామని, డీజే ఓనర్ పై కేసు నమోదు చేస్తామని సీఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.






