అల్గోల్ రోడ్డుకు మరమ్మతులు ప్రారంభం
జహీరాబాద్, ఆగస్టు 31 : జహీరాబాద్ నుండి అల్గోలుకు వెళ్లే రోడ్డు పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు ద్వారా అల్గోల్, పొట్పల్లి, ఎల్గోయి వరకు వెళ్లడమే కాకుండా ఈ రోడ్డు నుంచి అల్లాన కంపెనీ, నారింజ ప్రాజెక్టు నుండి బీదర్ వెళ్తుంది. ఇటీవల జహీరాబాద్లో గణేష్ ఉత్సవాల సందర్భంగా రాజకీయ పార్టీలు ఉత్సవ కమిటీతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు.
డి.ఎస్.పి సైదా నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు వినాయకులను అల్గోలు వెళ్లే రోడ్డు ద్వారా తీసుకెళ్లాలంటే జాతీయ రహదారి నుండి అల్గోలు వెళ్లే మార్గం దాదాపు 90 లక్షల రూపాయలతో బ్రిడ్జినిర్మాణం పూర్తి అయినప్పటికీ ఇరువైపుల 100 మీటర్లు రోడ్డు వేయకపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
దీంతో స్పందించిన రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో శనివారం నాడు రోడ్డు పనులు ప్రారంభమై శరవేగంగా నడుస్తున్నాయి. రోడ్డు పనులు ప్రారంభం కావడంతో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక మండపాల కమిటీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






