3 September, 2026 | 3:06 AM

నెలపాటు 30, 30(ఏ) పోలీసు యాక్ట్ అమలు

01-09-2025 | 12:00am

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, ఆగస్టు 31 :శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30 వరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పి.పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేనిది ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజాధనానికి నష్టం కల్గించే, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.