తపస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్
01-09-2025 | 12:00am
కొమురవెల్లి,ఆగస్టు 31 సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని తపస్ పల్లి రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంగా రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం, ఎక్కడినుండి పంపింగి అవుతున్నాయి తదితర విషయాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇరిగేషన్ అధికారులు బొమ్మకూరు నుండి తపస్పల్లి రిజర్వాయర్ కు నీటిని లిఫ్ట్ ద్వారా పంపింగ్ అవుతున్నట్లు కలెక్టర్ కు వివరించారు. ప్రాజెక్టు ఎఫ్ టి ఎల్ పరిధిని పరిశీలించి, రిజర్వాయర్ భూములను కబ్జా కాకుండా మానిటర్ చేయాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం రిజర్వాయర్కు లిఫ్ట్ చేస్తున్న పంపులను, వాటర్ ఫ్లో సిస్టంను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్ ఐ శ్రీనివాస్, ఇరిగేషన్ అధికారులు తదితరులు ఉన్నారు.






