20-01-2026 12:00:00 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, జనవరి 19 : మహిళల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తుంది అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం చిట్యాల పట్టణంలోని బిఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపాలిటి కి సంబంధించిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణి చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు.
కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడం ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, కనకదుర్గ దేవాలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, గుడిపాటి లక్ష్మీనరసింహ, ఏనుగు రఘు మా రెడ్డి, ఎద్దులపూరి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.