calender_icon.png 20 January, 2026 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి

20-01-2026 12:00:00 AM

సూర్యాపేట, జనవరి 19 (విజయక్రాంతి): ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ విసి హాల్ నందు జిల్లా అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ ముఖ్యఅతిథి సందేశానికి శాఖల అభివృద్ధి కార్యక్రమాల నివేదికలను పంపించాలన్నారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులచే సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, వివిధ శాఖల అభివృద్ధి తెలిపే విధంగా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ, అదనపు కలెక్టర్ కె సీతారామారావు, సిపిఓ కిషన్ నాయక్, డిఇఓ అశోక్, డిపిఓ యాదగిరి, ఇన్చార్జ్ డి ఆర్ డి ఏ పి డి శిరీష జిల్లా అధికారులు అందరూ పాల్గొన్నారు.