సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరించాలి
- రౌండ్ టేబుల్‌లో వక్తల డిమాండ్
- సీసీఐ పునరుద్ధరణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు
- టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం
ముషీరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాం తి): ఆదిలాబాద్ సీసీఐ సిమెంట్ పరిశ్రమ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పునరుద్ధరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం టాస్క్ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి రా ష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరణ ఉద్యమానికి త మ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నా రు.
సీసీ ఐ సాధన కమిటీ సభ్యులను పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వద్దకు తీసుకెళ్లి సమ స్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రొఫెసర్ కే నాగేశ్వర్ మాట్లాడు తూ ఆదిలాబాద్‌లో సున్నపురాయి, బంకమ ట్టి, బొగ్గు వంటి ముడి పదార్థాలు అందుబాటు లో ఉండటంతో తక్కువ వ్యయంతో సిమెం ట్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ పరిశ్రమ పునరుద్ధరణ కోసం 12 ఏళ్లుగా పోరా డుతున్నా మని, కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడు తూ తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ, సీసీఐ పునరుద్ధరణ కోసం నిరంతర ఉద్యమం చేస్తామని ప్రకటించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఆరు నె లల్లో పరిశ్రమను తెరిపించే బాధ్యత బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకోవాలని డిమా ండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరణకు తమ పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో కారం రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, జేవీ చలపతిరావు, నందిరామయ్య, జోజి రెడ్డి, నవీ న్, నాగరాజు, ఎస్‌వీసీ ప్రకాష్, గుడిసె రూబీ స్టీవెన్ సన్, పెద్దూరి వెంకన్న, మాధవ్, భా నుదాస్ తదితరులు పాల్గొన్నారు.






