నిద్రలేచిన అధికారులు.. శిలాఫలకంపై ఎమ్మెల్యే పేరు
- ‘విజయక్రాంతి’ కథనానికి స్పందన
- రామలక్ష్మీపురంలో సవరించిన శిలాఫలకం ఏర్పాటు
- ఎమ్మెల్యే పేరు రావడంతో శాంతించిన స్థానికులు, కాంగ్రెస్ నాయకులు
కోదాడ, ఆగస్టు 21 (విజయక్రాంతి): జిల్లాలోని కోదాడ మండలం రామలక్ష్మీపురం నుంచి కోదాడ మిర్యాలగూడ పీడ బ్ల్యూడీ రోడ్డు హుజూర్‌నగర్ సమీపం వర కు 4 కిలోమీటర్‌ల మేర ఉన్న రోడ్డును డబు ల్ రోడ్డుగా మార్చే విస్తరణ పనులకు కోదా డ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గురువా రం శంకుస్థాపన చేశారు. అయితే ఆ పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫల కంపై గ్రామం పేరు, స్థానిక ఎమ్మెల్యే పేరు లేకపోవడంపై ‘విజయక్రాంతి’ దినపత్రికలో శుక్రవారం ‘ఊరు ఊసు లేదు..
ఉత్తమ్ పద్మావతి పేరు లేదు’ పేరిట ప్రచురితమైన కథనానికి రోడ్లు, భవనాల శాఖ అధికారులు స్పందించారు. తమ తప్పును గుర్తించిన అధికారులు వెంటనే శిలాఫలకాన్ని సవరించి, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పేరును పొందుపరిచి శుక్రవారం కొత్తగా ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినప్పటికీ శిలాఫలకంపై ఆమె పేరు లేకపోవడంపై ఒకింత అసహనం వ్యక్తం చెందిన స్థానికులు, కాంగ్రెస్ శ్రేణులు సవరించిన శిలాఫలకం ఏర్పాటు చేయడం తో శాంతించారు. ఈ విషయాన్ని ప్రచురిం చి వెలుగులోకి తెచ్చి సమస్యను సమసిపోయేలా చేసిన ‘విజయక్రాంతి’ దినపత్రికకు స్థానికులు, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.






