26-05-2025 12:57:29 AM
- 83 పరుగులతో గుజరాత్ ఓటమి
-మరో మ్యాచ్‌లో కోల్‌కతా పరాజయం
అహ్మదాబాద్/ఢిల్లీ, మే 25: ఐపీఎల్ 18వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ముగించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 83 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. బ్రెవిస్ (57), కాన్వే (52) అర్థసెంచరీలతో రాణించారు.
ప్రసిధ్ క్రిష్ణ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. సాయి సుదర్శన్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్, నూర్ అహ్మద్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
క్లాసెన్ సెంచరీ..
డబుల్ హెడర్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 110 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు భారీ స్కోరు చేసింది. క్లాసెన్ (105 నాటౌట్), హెడ్ (76) దూకుడుగా ఆడారు.
37 బంతుల్లో శతకం సాధించిన క్లాసెన్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అనంతరం కోల్‌కతా ఛేదనలో 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. సునీల్ నరైన్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో ఉనాద్కట్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లు పడగొట్టారు. నేడు జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.