తొలిసారి నెగెటివ్ క్యారెక్టర్‌లో..
అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా ‘హైవాన్’. సరికొత్త థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ నిర్మిస్తున్నాయి. ఇతర కీలక పాత్రల్లో బొమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియ పిల్గాంకర్ నటిస్తున్నారు.
అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రమిది. అంతేకాదు అక్షయ్‌కుమార్ ఇందులో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 11న థియేట్రికల్ రిలీజ్‌కు వస్తున్న ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో సైఫ్ అలీఖాన్‌ను దివ్యంగుడి పాత్రలో చూపించడం ఆసక్తి రేపుతోంది. అక్షయ్‌కుమార్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించారు. ఈ చిత్రానికి డీవోపీ: దివాకర్ మణి; సంగీతం: ప్రీతమ్ చక్రవర్తి.






