15 April, 2026 | 3:16 AM

జుక్కల్ మండలంలో..

15-04-2026 12:00 AM

జుక్కల్, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని బస్వాపూర్, సావర్గం,  మహ్మదాబాద్, కంఠాలి, పెద్దగుల్ల, పడంపల్లి, బిజ్జల్వాడి, హంగర్గా, డోన్గాం, సోపూర్ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామ సర్పంచ్లు పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో సాయంత్రం భారీగా ర్యాలీ తీశారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు.    సర్పంచులు రమణ సురేష్ గొండా, కపిల్, సావిత్రి సాయ గౌడ్, బాలు, వీరేశం, విజయ సంజీవ్ లతో పాటు మండల స్థాయి నాయకులు బీఎస్పీ గంగారాం, మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే అన్ని పార్టీల ముఖ్య నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.