కాశీ డివైన్ ఘాట్స్‌లో..
నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌గా విడుదలైన ‘బుజ్జి తల్లి’ సాంగ్‌కు మంచి స్పందన దక్కింది. సెకండ్ సింగిల్ ‘-శివశక్తి’ని సైతం రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ బుధవారం ప్రకటించారు. డిసెంబర్ 22న కాశీలోని డివైన్ ఘాట్స్‌లో ఈ సాంగ్‌ను లాంచ్ చేస్తున్నట్టు వెల్లడించారు.
శ్రీకాకుళం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీ ముఖలింగం శివాలయ వైభవాన్ని తెలియజెప్పే ఈ పాట సంగీతపరంగా, విజువల్‌గా మంచి శ్రోతలకు మంచి అనుభూతిని ఇస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ జాతర పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి సమర్పణ: అల్లు అరవింద్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; డీవోపీ: షామ్‌దత్.






