8 July, 2026 | 4:43 AM

జాక్- ఏప్రిల్‌లో వస్తున్నాడు

19-12-2024 12:00 AM

సిద్దు జొన్నలగడ్డ కథాయకుడిగా డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘జాక్’. ఈ సినిమాకు ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్‌లైన్. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ సరసన ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, నరేశ్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతానికిపైగా పూర్తయ్యింది. మిగతా భాగం చిత్రీకరణను త్వరలోనే ముగించనున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. పూర్తి వినోదభరితంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.