07-12-2025 12:26:35 AM
వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘పోలీస్ కంప్లెయింట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహరాణా నిర్మిస్తున్నారు. వరలక్ష్మి తొలిసారి పూర్తిగా వినోదా త్మకమైన రోల్‌లో నటిస్తున్న సినిమా కావటంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మాట్లాడుతూ.. “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌పై ఈ సినిమాను నిర్మిస్తు న్నాం.
మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందన్న భావనను హారర్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో చూపించనున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే విడుదలకు సన్నాహాలు చేస్తాం” అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సుధాకర్ మారియో, సంజీవ్ మేగోటి; సాహిత్యం: సాగర్ నారాయణ, సంజీవ్ మేగోటి, చింతల ప్రసన్న రాములు; సినిమాటోగ్రఫీ: ఎస్‌ఎన్ హరీశ్; ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్, రవితేజ; ఎడిటర్: అనుగోజు రేణుకా బాబు; ఆర్ట్: మురళీధర్ కొండపనేని.