24 March, 2026 | 5:35 AM

ఆస్ట్రేలియాలోని ఐసీఏక్యూ ఎన్నికల్లో తెలుగువారి హవా

29-09-2024 01:08 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): క్వీన్స్‌లాండ్‌లోని భారతీయ సమాజ ప్రముఖ సంస్థ (ఐసీఏక్యూ) ఎన్నికల్లో తెలుగు ప్రజలు పైచేయి సాధించారు. 20కిపైగా సభ్యసంస్థలతో, 20 వేల మంది భారత సంతత ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఐసీఏక్యూ ఎన్నికల్లో విజయం సాధించారు. అధ్యక్షుడిగా కట్టా అశిష్ రెడ్డి, కోశాధికారిగా ఆండెం శ్రీకర్ రెడ్డి, కార్యనిర్వహక కమిటీ సభ్యుడిగా విరించి రెడ్డి ఎన్నికయ్యారు.