calender_icon.png 16 November, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

16-11-2025 12:02:19 AM

సింగర్ బన్ గయా ఎమ్మెల్యే

మైథిలీ ఠాకూర్ ఆధ్యాత్మిక, జానపద గీతాలతో సోషల్ మీడియాలో ఒక సంచలనం. పాతికేళ్ల వయసులో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించింది. అలీనగర్ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగి స్థానిక ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను ఓడించి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టనుంది. సింగర్‌గా ఆకట్టుకున్న మైథిలీ ఎమ్మె ల్యేగా ఎలా రాణిస్తుందో చూద్దాం. 

రిషబ్ పంత్ చరిత్ర 

భారత జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 2 సిక్సర్లు బాదిన పంత్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ సెహ్వాగ్ (90 సిక్సర్లు) పేరిట ఉండేది. తాజాగా పంత్ వీరూ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. పంత్ , సెహ్వాగ్ తర్వాత రోహిత్, జడేజా, ధోనీ నిలిచారు.