calender_icon.png 11 January, 2026 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

11-01-2026 12:44:51 AM

బ్రేకుల్లేని బుడ్డోడు

వరల్డ్ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకాండ కొత్త ఏడాదిలోనూ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది ఐపీఎల్, అండర్ 19 ఆసియా కప్‌లో దుమ్మురేపిన వైభవ్ తాజాగా సౌతాఫ్రికాపైనా రికార్డుల మోత మోగించాడు. ఇప్పుడు అండర్ 19 ప్రపంచకప్ లోనూ చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. అండర్ 19 క్రికెట్‌లో కోహ్లీ రికార్డులను తిరగరాస్తూ అంతర్జాతీయ అరంగేట్రానికి రెడీ అవుతున్నాడు.

దిగ్గజ నేత కల్మాడి

సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు సురేశ్ కల్మాడి. ఎనిమిదేళ్లపాటు వాయుసేనలో పైలట్‌గా పనిచేశారు. రెండుసార్లు ఇండో పాక్ యుద్ధాల్లో ముఖ్యభూమిక పోషించారు. మూడు పర్యాయాలు పుణె ఎంపీగా, మరో నాలుగు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.