calender_icon.png 18 January, 2026 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

18-01-2026 12:33:17 AM

సాహిత్య పిపాసి.. ఇందిరాదేవి

రాజకుమారి ఇందిరా దేవి ధన్‌రాజ్‌గిర్ సాహిత్య జగత్తులో ఒక ధ్రువతారగా వెలిగారు. ఆమె ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్రశర్మ జీవిత సహచరిణి. వారిది  కవిద్వయ హృదయాల సంగమం. ఇందిరాదేవి కలం నుంచి అద్భుతమైన ఆంగ్ల కవిత్వం వచ్చింది. భావుకతను, గాంభీర్యాన్ని మేళవించి కవితలు రాయడంలో అందెవేసిన చేయి. ఇందిరాదేవి సాహిత్యం పట్ల అపారమైన అనురాగాన్ని కనబరిచారు. వృద్ధాప్య సమస్యలతో దివికేగారు. 

పట్టువిడువని పళనిస్వామి

ఎడప్పాడి పళనిస్వామి.. ఒకప్పుడాయన అన్నాడీఎంకేలో ఒక చిన్న కార్యకర్త. ఇప్పుడాయన పార్టీ ప్రధాన కార్యదర్శి. పురచ్చి తలైవి జయలలిత నమ్మిన బంటు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. 2016 లో జయలలిత మరణం తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తర్వా త పార్టీ అధికారాన్ని కోల్పోయింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తూ, మేనిఫెస్టో విడుదల చేశారు.