ఈ వారం వార్తల్లో..
ఆసియా కుబేరుడు అదానీ
ఆసియాలోనే అపర కుబేరుడిగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సరికొత్త రికార్డు సృష్టించారు. నిన్నమొన్నటి వరకు అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టారు. బ్ల్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం వీరిద్దరూ ప్రపంచ టాప్ -20 ధనికుల జాబితాలో నిలిచారు. అదానీ నికర సంపద విలువ ప్రస్తుతం 92.6 బిలియన్ డాలర్లు.
బీహార్ ‘సామ్రాట్’
బీహార్ రాజకీయాల్లో ఒక కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగిన సామ్రాట్ చౌదరి ప్రస్థానం స్ఫూర్తినిస్తుంది. శాసనమండలిలో విపక్ష నేతగా, డిప్యూటీ సీఎంగా సేవలందించారు. అనేక సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ నుంచి సీఎం అయిన మొట్టమొదటి నేత ఆయనే కావడం విశేషం.






