7 July, 2026 | 3:38 PM

Breaking News

సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •  

ఈ వారం వార్తల్లో..

15-06-2025 12:55 AM

తగ్గేదేలే అంటున్న ఖమేనీ! 

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ హొస్సేనీ ఖమే నీ.. ఆయన అంటే గిట్టని వారికి గుండె దడే. తాజాగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నా తగ్గేదేలే అంటున్నారు ఖమేనీ. ‘కఠిన శిక్ష’ ఎదుర్కోక తప్పదని ఆయన ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. ఇది వరకే ఇరాన్ అధ్యక్షుడిగా సేవలందించిన ఖమేనీ, ఇజ్రాయెల్‌ను ఎలా నిలురించాలో ఇరాన్‌కు తెలుసునని చెబుతున్నారు.   అమెరికా అణుఒప్పందం చేసుకోవాలని ఎంతలా ఒత్తిడి తెస్తున్నా ఖమేనీ మాత్రం ససేమిరా అంటున్నారు. ఆయన ఇరాన్‌ను ఏ తీరానికి చేరుస్తాడో చూడాలి మరి.

ఖతర్నాక్ నెతన్యాహు! 

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 75 ఏండ్ల వయసులోనూ పక్క దేశాలను గడగడలాడిస్తుండు. హార్వర్డ్ నుంచి పట్టా పొందిన కెప్టెన్ సాబ్ ఆరేండ్ల పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్‌లో సత్తా చాటిండు. అంచెలంచెలుగా ఎదిగి సెరెన్ (కెప్టెన్) ర్యాంకుకు చేరుకున్నడు. ఇప్పటికే హమాస్‌కు ముచ్చెమటలు పట్టించిన నెతన్యాహు ఇప్పుడు ఇరాన్‌నూ భయబ్రాంతులకు గురి చేస్తండు. చాలా కాలంగా తమ వెంట పడ్డ ఇరాన్‌ను గుండెలపై కొడతానని నెతన్యాహు చెప్తున్నడు.