calender_icon.png 20 September, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే ఎన్నికల్లో.. బహుజనులదే రాజ్యాధికారం

20-09-2025 12:55:47 AM

ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ 

ఖైరతాబాద్; సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బహుజనులకు రాజ్యాధికారం ఖాయమని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండి యా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు.  ఈ మేరకు  బహుజనుల పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చి తెలం గాణ బహుజన కూటమిగా ఏర్పడినట్లు తెలిపారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ 55వ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం  సోమాజిగూ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ లో ప్రత్యామ్నాయ రాజకీయాలు- బహుజన పార్టీల పాత్ర’ అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన  కన్వీనర్ భగవాన్ గవాయ్, ప్రొఫెసార్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. విసికె పార్టీ, సమన్వదీ పార్టీ, రాజ్యాధి కార పార్టీ, బహుజన లెఫ్ట్ పార్టీ (సూర్యప్రకాశ్ తెలంగాణ మహాజన సేన, తెలంగాణ రాజ్యాధికార పార్టీ లతో కలసి కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలను రాజకీ య అధికారం తీసుకురావడమే ఈ కూటమి లక్ష్యమని స్పష్టంచేశారు. సమావేశంలో ఆర్ పిఐ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వల శ్రీకాం త్, కోశాదికారి కె. మురళి, తెలంగాణ ఎపి రాష్ట్రల ఇన్చార్జి డా. మేజర్ చంద్రకాంత్, భారతీయ బౌద్ధ వింగ్  గణేశ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎజాజ్ హుస్సేన్ పాల్గొన్నారు.